KCR: కేసీఆర్ కు 6 రకాల పరీక్షలను నిర్వహించిన వైద్యులు.. ఆసుపత్రి నుంచి ఫామ్ హౌస్ కు బయల్దేరిన సీఎం!

Doctors conducted 6 types of tests to KCR
  • వైద్య పరీక్షల కోసం యశోదా ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్
  • అందరికీ 3 అడుగుల దూరాన్ని కొనసాగించిన సీఎం
  • కేసీఆర్ వాహనంలో డ్రైవర్, ఒక గన్ మెన్ మాత్రమే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోదా ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయన తన ఫామ్ హౌస్ కు బయల్దేరారు. కాన్వాయ్ లో కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో కేవలం డ్రైవర్, ఒక గన్ మెన్ మాత్రమే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ కు ఆసుపత్రిలో ఆరు రకాల పరీక్షలను నిర్వహించారు. సీఆర్పీ, సీబీపీ, సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్ రే, ఐఎల్-6, లివర్ ఫంక్షన్ టెస్టులను నిర్వహించారు.

ఆసుపత్రిలో కేసీఆర్ అందరికీ మూడు అడుగుల దూరాన్ని కొనసాగించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వెంటనే ఆయన ఆసుపత్రి నుంచి బయల్దేరారు. అయితే, ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్... ఎప్పటి మాదిరే చలాకీగా కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, కేసీఆర్ కు నిర్వహించిన టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
KCR
TRS
Yashoda Hospital
Corona Virus

More Telugu News