చిరూకి ఇంకా స్క్రిప్ట్ నచ్చలేదట!

21-04-2021 Wed 19:01
  • వాయిదాపడిన 'ఆచార్య' షూటింగ్
  • 'లూసిఫర్' రీమేక్ కి సన్నాహాలు
  • స్క్రిప్ట్ పై సాగుతున్న కసరత్తు
  • దర్శకుడిగా మోహన్ రాజా
Chiranjeevi did not like the script of Lucifer remake

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వలన ప్రస్తుతం షూటింగును వాయిదా వేశారు. ఈ సినిమా తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా, మంచి వసూళ్లతో పాటు ప్రశంసలను తెచ్చిపెట్టింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న మోహన్ రాజాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేయమని చెప్పారట. అయితే మోహన్ రాజా చేసిన మార్పుల పట్ల చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదట. ఆయన చేసిన సూచనలను మరోసారి వంటబట్టించుకుని, ఆ మార్పులు చేసే పనిలో మోహన్ రాజా నిమగ్నమై ఉన్నాడని చెప్పుకుంటున్నారు.