కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు కరోనా పాజిటివ్‌

21-04-2021 Wed 18:40
  • దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం
  • ప్రముఖులనూ వదలని మహమ్మారి
  • పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులకు కరోనా  
Central Min Ramesh pokhriyal Tests corona positive

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

 ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల్లో తనని కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విద్యాశాఖకు సంబంధించిన పనులను చూస్తున్నానని మంత్రి తెలిపారు.