హీరోయిన్ రష్మిక గుండుతో ఉన్న ఫొటోలు చూసి నెటిజ‌న్ల షాక్!

21-04-2021 Wed 15:57
  • త‌మిళ‌నాడులో సెలూన్ షాపుల ముందు ఫొటోలు
  • ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం
  • ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న‌ అభిమానులు
rashmika pics go viral

హీరోయిన్ రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫొటోలు చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.  తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై కొంద‌రు ఈ ఫొటోల‌ను పెట్టారు. వారంతా ఉద్దేశ‌పూర్వ‌కంగానే వీటిని పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వ్యాపారం కోసం వారు రష్మిక ఫోటోను ఇలా వాడుతుండ‌డం ప‌ట్ల ఆమె అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
 
   
మ‌రికొంద‌రు ఆ ఫొటోల‌తో మీమ్స్ సృష్టిస్తున్నారు. హీరోయిన్లు గుండు చేయించుకున్న సామాజిక మాధ్య‌మాల్లో ఫొటోలు వైర‌ల్ కావ‌డం అన్నది ఇదే కొత్త కాదు. గ‌తంలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్ తో పాటు ప‌లువురు హీరోయిన్ల గుండు ఫొటోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక టాప్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.