Japan: భారత పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ ప్రధాని

Japanese PM cancels India visit amid rising COVID cases
  • వచ్చే వారం భారత్‌లో పర్యటించాల్సిన జపాన్ పీఎం
  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రద్దు
  • ఇప్పటికే రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్
వచ్చే వారం భారత పర్యటనకు రావాల్సిన జపాన్ ప్రధాని యోషిహిదే సుగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. సుగా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి పర్యటన. ఆయన భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌ను కూడా సందర్శించాల్సి ఉంది. కాగా, ఈ నెల 25న భారత పర్యటనకు రావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తన  పర్యటనను ఇదివరకే రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ తీవ్రంగా మారిన నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Japan
Yoshihide Suga
India
COVID19

More Telugu News