దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

21-04-2021 Wed 12:24
  • ఆదర్శ జీవనానికి శ్రీరామ నవమి ప్రేరణ
  • నియమబద్ధ జీవనంతో కరోనాను తరిమి కొడదాం
  • కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే మార్గాలను పాటించండి: మోదీ
President Kovind and Modi wishes behalf On Sri Rama Navami
దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న రాష్ట్రపతి ఆదర్శ పురుషుడైన శ్రీరాముని జన్మదినం సందర్భంగా జరుపుకునే వేడుక అని, ఆదర్శ ప్రాయమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. నియమబద్ధ జీవనంతో కరోనా మహమ్మారిని తరిమికొడదామని ట్వీట్ చేశారు.

ఆదర్శ ప్రాయమైన జీవితం గడపాలని శ్రీరాముడు మనకు సందేశమిస్తున్నాడని, కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి గడ్కరీ కూడా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.