Night Curfew: నైట్ కర్ఫ్యూ వేళ పోలీసుల లాఠీచార్జ్ అంటూ యూట్యూబ్‌లో వీడియోలు.. చానల్ రిపోర్టర్ అరెస్ట్

  • కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • నిన్నటి నుంచే అమల్లోకి
  • తొలి రోజు పోలీసులు లాఠీలకు పనిచెప్పారంటూ వీడియోలు
  • క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన హైదరాబాద్ సీపీ
YouTube Reporter Arrested As He Posted Police Lathi Charge Fake Videos

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రభుత్వం నిన్ననే ప్రకటించి నిన్నటి నుంచే అమలు చేయడంతో చాలామందికి ఈ విషయం చేరలేదు. దీంతో పోలీసులు తొలి రోజు కాస్తంత చూసీచూడనట్టు వ్యవహరించారు.

అయితే, రాత్రి తొమ్మిది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ యూట్యూబ్ చానల్‌ పలు వీడియోలను పోస్టు చేసింది. ఇందులో ప్రజలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నట్టు ఉంది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆ వీడియోలు పోస్టు చేసిన చానల్ రిపోర్టరుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్టు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

More Telugu News