ఏపీలో కరోనా నియంత్రణకు మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

20-04-2021 Tue 22:07
  • ఏపీలోనూ కరోనా బీభత్సం
  • నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
  • కన్వీనర్ గా వ్యవహరించనున్న ఆళ్ల నాని
  • ఈ నెల 22న కమిటీ సమావేశం
Committee for corona crisis in AP
ఏపీలోనూ కరోనా భూతం తాండవం చేస్తుండడంతో ప్రభుత్వం మరింత పటిష్ఠమైన  చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత ఈ కమిటీలో సభ్యులు.

ఏపీలో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కరోనా రోగులకు అందుతున్న చికిత్స, ఇతర సేవలు, కమాండ్ కంట్రోల్ తదితర అంశాలను ఈ ఐదుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షించనుంది. ఈ క్రమంలో ఈ నెల 22న మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో కమిటీ సమావేశం కానుంది. ఏపీలో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో, వ్యాప్తిని మరింత సమర్థంగా అరికట్టడం పైనా, వ్యాక్సినేషన్ పైనా ఈ సమావేశంలో చర్చిస్తారు.