అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!

20-04-2021 Tue 17:32
  • శివ నిర్వాణతో నాని రెండో సినిమా  
  • వాయిదాపడిన 'టక్ జగదీశ్'
  • కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటున్న నాని  
Nani Ignores Tuck jagadeesh story at frist
నానీకి ఒక అలవాటు ఉంది .. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ కలిసి పని చేయడం. అలా ఆయన గతంలో తనతో 'నిన్నుకోరి' సినిమా చేసిన శివ నిర్వాణతో 'టక్ జగదీశ్' సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 23వ తేదీన విడుదల కావలసి ఉంది .. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమాకి సంబంధించి 'పరిచయ వేదిక 'ను గ్రాండ్ గా నిర్వహించారు. పాత్రలను ..  పాత్రధారులను ఆ వేదికపై వీడియో రూపంలో పరిచయం చేశారు. ఇది ఒక అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తు వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ .. " శివ నిర్వాణ నాకు కాల్ చేసి ఒక మంచి కథ ఉంది .. వినిపించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆల్రెడీ మా ఇద్దరి కాంబినేషన్లో 'నిన్నుకోరి' అనే ఒక ప్రేమకథ వచ్చింది. మళ్లీ ఇతను ప్ర్రేమకథనే తీసుకుని వచ్చి ఉంటాడని అనుకున్నాను. మొహమాటానికి వినేసి బాగోలేదని చెప్పేస్తే ఒక పనైపోతుంది గదా అనుకున్నాను. అతను వచ్చి 'టక్ జగదీశ్' కథను వినిపించాడు. ఆ కథ వినగానే నేను షాక్ అయ్యాను .. అంత గొప్పగా అనిపించింది. నా కెరియర్లో నాకు బాగా నచ్చిన కథ ఇది. నేను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.