'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!

20-04-2021 Tue 17:03
  • షూటింగు దశలో 'పుష్ప'
  • రీసెంట్ గా జాయినైన ఫహాద్ ఫాజిల్
  • వెనక్కి తగ్గని సుకుమార్
Sukumar daring step on shooting Pushpa movie
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. కరోనా కారణంగా అప్పుడప్పుడు షూటింగు వాయిదా వేసుకున్నా, మళ్లీ వెంటనే షాట్ రెడీ అంటూ సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం కూడా కరోనా ఒక రేంజ్ లో తన ప్రభావం చూపుతోంది. అయితే ఈ సారి మాత్రం సుకుమార్ షూటింగు ఆపడం లేదు. రీసెంట్ గా చాలా సినిమాలు పేకప్ చెప్పేసి ఇళ్లకి చేరుకున్నాయి. ఇక కొంతమంది తమ సినిమాల రిలీజ్ డేట్లను ను కూడా వాయిదా వేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో 'పుష్ప' సినిమా షూటింగు కూడా వాయిదా పడుతుందనీ, అందువలన రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ సుకుమార్ మాత్రం షూటింగు ఆపే ప్రసక్తే లేదని అంటున్నాడట. ఇప్పటికే కరోనా కారణంగా చాలా సమయం వృథా అయింది .. చాలామంది డేట్లు గందరగోళంగా మారాయి. అందువలన ఈ సారి అనుకున్న సమయానికి షూటింగును పూర్తి చేయవలసిందే. ముందుగా చెప్పినట్టే ఆగస్టు 13న రిలీజ్ చేయవలసిందే అనే పట్టుదలతో ఉన్నాడట. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే.