Etela Rajender: సరిహద్దు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయి: ఈట‌ల‌

  • ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడ‌దు
  • ఆరోగ్య‌ శాఖ  పూర్తిగా అప్రమత్తంగా ఉంది
  • కేవలం 5 శాతం మందే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
we are On the alert says eetala

క‌రోనా మ‌రోసారి విజృంభించిన నేప‌థ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడ‌ద‌ని, త‌మ శాఖ  పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్ భరోసా ఇచ్చారు. సూర్యాపేటలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. కరోనా రెండో ద‌శ వ్యాప్తిలో సరిహద్దు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.

క‌రోనా రోగులు 95 శాతం మంది ఆక్సిజన్, వెంటిలేటర్ల‌ అవ‌స‌రం లేకుండానే చికిత్స పొందుతున్నారని తెలిపారు. క‌రోనా రోగుల్లో కేవలం 5 శాతం మందే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. అలాగే, ఏడాది కాలంగా 99.5 శాతం క‌రోనా రోగులు కోలుకున్నార‌ని తెలిపారు. తెలంగాణ‌లో వందలాది కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

More Telugu News