Vijayashanti: రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు: విజ‌య‌శాంతి

  • క‌రోనా క‌ట్ట‌డిపై న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు
  • ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది  
  • కేసీఆర్ గారు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించారు
  • పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేవు
  • ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు  
vijaya shanti slams trs

తెలంగాణ‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న‌ నేప‌థ్యంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్స్ కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది.
 
సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో... అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు, గుణపాఠం నేర్చుకోవడం లేదు.

కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారు. రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ, పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు. ఈ నేతలు, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారు' అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News