Gujarat: గుజరాత్ లో కోవిడ్ సెంటర్ గా మారిన మసీదు!

Masjid in Gujarat becomes as Covid center
  • గుజరాత్ లో పంజా విసురుతున్న కరోనా
  • ప్రజల కష్టాలను తీర్చేందుకే ఈ నిర్ణయమన్న నిర్వాహకులు
  • రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు తెలపాలని విన్నపం
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పలు ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి. వైరస్ పంజా విసురుతునన్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది. ప్రతి రోజు అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు. ఈ క్రమంలో గుజరాత్ వడోదర నగరంలోని జహంగీర్ పూర్ లోని ఓ మసీదు నిర్వాహకులు అందరికీ స్ఫూర్తిని కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారు. మసీదును కోవిడ్ సెంటర్ గా మార్చేశారు.

ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదుకు మించిన సదుపాయాలు ఎక్కడా లేవని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని... ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని... అందుకే మసీదును కోవిడ్ సెంటర్ గా మార్చామని చెప్పారు.
Gujarat
Masjid
Covid Center

More Telugu News