New Delhi: అంతా మా ఆవిడే చేసింది.. ‘ముద్దిస్తా.. అడ్డుకుంటారా?’ ఘటనపై స్పందించిన భర్త!

Arrested Delhi man blames wife after video abusing cops goes viral
  • ఆమె మాస్క్ పెట్టుకోలేదు, నన్ను పెట్టుకోనివ్వలేదు
  • ఆమె రెచ్చగొట్టడం వల్లే పోలీసులతో గొడవ పెట్టుకున్నా
  • అందరూ విధిగా మాస్కులు ధరించాలి
మాస్కు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు ఢిల్లీ పోలీసులపై ఓ జంట విరుచుకుపడిన వీడియో ఒకటి నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాను మాస్క్ పెట్టుకోనని, ఇక్కడే తన భర్తకు ముద్దిస్తానని, అడ్డుకుంటారా? అంటూ సదరు మహిళ వీరంగమేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులతో జరిగిన గొడవపై మహిళ భర్త స్పందిస్తూ.. భార్యను నిందించాడు. ఈ గొడవ మొత్తానికి కారణం తన భార్యేనని పంకజ్ దత్తా పేర్కొన్నాడు. తప్పంతా తన భార్యదేనని, మాస్కు పెట్టుకోవాలని చెబుతున్నా వినలేదని వాపోయాడు. తను మాస్క్ పెట్టుకోలేదు సరికదా, తననూ పెట్టుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మాస్క్ విషయమై తామిద్దరం కారులో గొడవ పడ్డామని, అదే సమయంలో పోలీసులు ఆపారని పేర్కొన్నాడు. పోలీసులతో గొడవ తనకు ఇష్టం లేకున్నా భార్యే తనను రెచ్చగొట్టిందని అన్నాడు. ఆమె పక్కన లేనప్పుడు తాను మాస్క్ ధరిస్తానని చెప్పిన పంకజ్.. అందరూ విధిగా మాస్కులు ధరించాలని చెప్పడం కొసమెరుపు.
New Delhi
Mask
Corona Virus
couple
Police

More Telugu News