Afghnistan: మీ నిర్ణయం భేష్.. బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం

  • ఆఫ్ఘనిస్థాన్ నుంచి సేనలను ఉపసంహరిస్తున్నట్టు బైడెన్ ప్రకటన
  • ఆఫ్ఘన్‌లో 20 ఏళ్ల యుద్ధానికి తెర
  • అద్భుత, సానుకూల విషయమన్న ట్రంప్
Trump calls Afghanistan withdrawal a wonderful and positive thing

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ సేనలను ఉపసంహరించుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇదొక అద్భుత, సానుకూల విషయమన్న ట్రంప్.. గడువు విషయంలో మాత్రం విమర్శించారు. సెప్టెంబరు 11వ తేదీలోపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి సేనలను వెనక్కి పిలిపిస్తామంటూ గతవారం బైడెన్ ప్రకటించారు. అయితే, అంతదూరం ఎందుకని, మే 1 నాటికి ఆ పనేదో పూర్తిచేస్తే బాగుంటుందని అన్నారు. వీలైనంత వరకు గడువును తగ్గించే ప్రయత్నం చేయాలని సూచిస్తూ ఇందుకు రెండు కారణాలు చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో మన సేనలు అడుగుపెట్టి 19 ఏళ్లు దాటిందని, కాబట్టి వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని అన్నారు. ఆ పని మనం చేయగలమన్నారు. రెండోది.. సెప్టెంబరు 11. ఇది అమెరికా ప్రజలకు విషాదమైన రోజని, ఆ రోజున జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారిని స్మరించుకునేందుకు ఆ రోజును విడిచిపెట్టేయాలని కోరారు.

మరోవైపు, 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ సేనలను వెనక్కి పిలిపించాలన్న బైడెన్ నిర్ణయంపై మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా ప్రశంసించారు. కాగా, బైడెన్‌ను ట్రంప్ ప్రశంసించడంపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News