సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

20-04-2021 Tue 07:33
  • జర్నలిస్టు పాత్రలో శ్రుతిహాసన్
  • షూటింగ్ వద్దన్న జగపతిబాబు
  • వీరభద్రంతో ఆది సాయికుమార్     
Shruti Hassan plays as a journalist

*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో ఆమె పొలిటికల్ జర్నలిస్టుగా విభిన్న తరహా పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూలు షూటింగ్ ఆమధ్య జరిగింది.
*  అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహా సముద్రం' చిత్రం షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు జగపతిబాబు వైజాగ్ షెడ్యూల్ లో జాయిన్ అవడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. కరోనా తీవ్రరూపం దాల్చిన ప్రస్తుత పరిస్థితులలో తాను షూటింగుకు రాలేనని ఆయన చెప్పారట.
*  ఆది సాయికుమార్ హీరోగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.  ఇది పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతోందని దర్శకుడు తెలిపారు. గతంలో వీరిద్దరి కలయికలో 'చుట్టాలబ్బాయి' సినిమా వచ్చిన సంగతి విదితమే.