Drugs: రూ.3 వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు స్వాధీనం

  • అరేబియా సముద్రంలో పట్టుబడ్డ ముఠా
  • 300 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం
  • పాకిస్థాన్ మాక్రాన్ తీరం దిశ నుంచి వచ్చిన ముఠా
  • అరెస్టయిన వారిలో ఐదుగురు శ్రీలంకవాసులు 
rs 3000k worth Drugs Has been seized

అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠాను భారత నావికాళం అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 3 వేల కోట్లు విలువ చేసే 300 కిలోల మాదకద్రవ్యాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో కేరళ తీరాన వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అరెస్టయిన వారిలో ఐదుగురు శ్రీలంకవాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే... అరేబియా సముద్రంలో ‘సువర్ణ’ నౌకలో గస్తీ నిర్వహిస్తోన్న భారత నావికా దళ సిబ్బందికి ఓ మత్స్యకారుల పడవపై అనుమానం కలిగింది. వెంటనే వారి దగ్గరకు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.  పాకిస్థాన్‌లోని మాక్రాన్‌ తీరం నుంచి భారత్‌, మాల్దీవులు, శ్రీలంక కేంద్రాలుగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా గతంలోనూ వెలుగుచూసింది. అయితే, తాజాగా పట్టుబడ్డ పడవతో మాదకద్రవ్యాల రవాణాకు అవకాశం ఉన్న మరికొన్ని మార్గాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

More Telugu News