మన్మోహన్‌ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ ఆకాంక్ష

19-04-2021 Mon 22:14
  • కరోనా బారినపడ్డ మన్మోహన్‌ సింగ్‌
  • ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స
  • ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖుల ప్రార్థన
PM Modi wishes Manmohan Singh speedy recovery

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖులంతా ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్‌ అనారోగ్యం పట్ల స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం మన్మోహన్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. కొవిడ్ నియంత్రణపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆదివారమే ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు సైతం కరోనా బారినపడ్డారు.