ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 189 రన్స్

19-04-2021 Mon 21:40
  • ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ రాజస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్
  • డుప్లెసిస్ 33 పరుగులు
  • బ్రావో 8 బంతుల్లో 20 రన్స్
Chennai Super Kings set target to Rajasthan Royals

ముంబయి వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 33, మొయిన్ అలీ 26, రాయుడు 27, బ్రావో 20 నాటౌట్ రాణించారు. ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినా తలో చేయి వేయడంతో చెన్నై స్కోరు ముందుకురికింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీయగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీశారు.