Nara Lokesh: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి నారా లోకేశ్ లేఖ

  • ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ
  • వేల సంఖ్యలో రోజువారీ కేసులు
  • పదుల సంఖ్యలో మరణాలు
  • తీసుకోవాల్సిన చర్యలపై ఆళ్ల నానికి లోకేశ్ లేఖ
TDP MLC Nara Lokesh wrote state health minister Alla Nani

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని పేర్కొన్నారు.

లోకేశ్ లేఖలోని ముఖ్యాంశాలు ఇవిగో...

  • ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూసేందుకు ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేయాలి.
  • వీలైనంత తక్కువగా ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలి.
  • చిరు వ్యాపారులు, టిఫిన్ బండ్లు నడిపేవాళ్లు, కూరగాయల విక్రేతలు నష్టపోకుండా ప్రత్యామ్నాయం కల్పించాలి.
  • ముగ్గురు మించి ఎక్కడా గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి.
  • వలస కూలీలకు ఆకలి బాధ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
  • స్కూళ్లను మూసివేసినా విద్యార్థుల పౌష్టికాహారం, శానిటరీ న్యాప్ కిన్ లు అందించేలా అంగన్ వాడీ కేంద్రాలను ప్రోత్సహించాలి.
  • రక్తనిధి కేంద్రాల్లో తగినంత రక్తం నిల్వ ఉండేలా చూడాలి.
  • రక్తదానం చేసేవారికి ఉచిత కరోనా పరీక్షలు చేయాలి.
  • ఆసుపత్రుల్లో ప్లాస్మా దాతల సమాచారం అందుబాటులో ఉంచాలి.

More Telugu News