సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

19-04-2021 Mon 19:55
  • తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా
  • ఫాంహౌస్ లో చికిత్స
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • కేసీఆర్ ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్ష
  • మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోగ్యంపైనా చంద్రబాబు ఆందోళన
Chandrababu wishes CM KCR a speedy recovery from corona

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కరోనా బారినపడడంతో ఆయన క్షేమాన్ని కోరుకుంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్-19 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

అటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ అన్న సంగతి తెలియడంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గారు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.