తల్లి విజయమ్మ పుట్టినరోజు వేడుకల్లో షర్మిల... ఫొటోలు ఇవిగో!

19-04-2021 Mon 15:21
  • నేడు వైఎస్ విజయమ్మ జన్మదినం
  • పలు చోట్ల వేడుకలు
  • తల్లితో కేక్ కట్ చేయించిన షర్మిల
  • శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
Sharmila attends her mother YS Vijayamma birthday celebrations

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తల్లితో కేక్ కట్ చేయించి ఆమె ఆనందంలో తాను కూడా పాలుపంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా విజయమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వైసీపీ రంగులతో ఉన్న కేక్ కట్ చేసి సందడి చేశారు.