హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

19-04-2021 Mon 14:56
  • కొన్ని రోజులుగా త‌గ్గిన ఎండ వేడి
  • ఈ రోజు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షం
  • ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు  
rain in hyderabad

ఈ నెల తొలి వారంలో ఎండ‌లు మండిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు ప‌డుతుండ‌డంతో వేడిమి త‌గ్గింది. ఈ రోజు కూడా హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియ‌డంతో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం నెల‌కొంది.  

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్, ఫిలింనగర్ లో భారీ వ‌ర్షం కురిసింది. అలాగే, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, మెహదీపట్నంతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఈ రోజు వర్షం పడింది. ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు పడుతున్నాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.