కొవిడ్ ఎఫెక్ట్: భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని

19-04-2021 Mon 14:47
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం
  • భారత్ లో అత్యంత తీవ్రంగా కరోనా వ్యాప్తి
  • తొలుత పర్యటన కుదించుకున్న బోరిస్ జాన్సన్
  • ఆపై పూర్తిగా రద్దు నిర్ణయం
  • వర్చువల్ విధానంలో మోదీతో భేటీ కానున్న బ్రిటీష్ ప్రధాని
British prime minister Boris Johnson cancels India tour next week
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించాలని మరోసారి భావించినా కరోనా అందుకు అడ్డుపడింది. ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్ కరోనా కారణంగా రాలేకపోయారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఆయన ఈ నెల చివరి వారంలో భారత్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కరోనా మళ్లీ తీవ్రం కావడంతో పర్యటనను కుదించుకున్నారు. కానీ, కరోనా ఏమాత్రం శాంతించకపోవడంతో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది.

ఈ నేపథ్యంలో, వర్చువల్ విధానంలో భారత్, బ్రిటన్ పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.