విలీనం చేస్తామని ‘కాళ్లు పట్టుకున్నా’ కమలం పెద్దల నుంచి స్పందన లేదు: టీడీపీపై విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యం

19-04-2021 Mon 13:37
  • 17 తర్వాత పార్టీ ఉండ‌ద‌న్నారు
  • అచ్చెన్న డిక్లరేషన్ అమల్లోకి వ‌చ్చిన‌ట్లే
  • తదుపరి కార్యాచరణపై అను'కుల' మీడియా పార్టనర్లతో బాబు సమాలోచనలు
  • కరోనా పేరుతో మినీ మహానాడు  ఉండదని అంటున్నారు
vijay sai reddy slams tdp

టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీని విలీనం చేస్తామన్నా కమలం పెద్దల నుంచి స్పందన లేదని ఆయన దెప్పిపొడిచారు.

'17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్న డిక్లరేషన్ అమల్లోకి వచ్చినట్టే. విలీనం చేస్తామని ‘కాళ్లు పట్టుకున్నా’ కమలం పెద్దల నుంచి స్పందన లేదు. తదుపరి కార్యాచరణపై అను'కుల' మీడియా పార్టనర్లతో సమాలోచనలు జరుపుతున్నాడట బాబు. కరోనా పేరుతో మినీ మహానాడు కూడా ఉండదని అంటున్నారు' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.