kolkata: క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం!

mamata wont participate in rallies in kolkata
  • కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో మ‌మ‌త పాల్గొన‌రు
  • చివరి రోజైన ఏప్రిల్‌ 26న మాత్రమే పాల్గొంటారు
  • జిల్లాల్లో అన్ని ఎన్నికల ర్యాలీల సమయం 30 నిమిషాలకు కుదింపు: డెరెక్
క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ లో ఇకపై ఎన్నికల ప్రచారం నిర్వహించబోనని, మిగతా రాజకీయ నాయకులకూ ఇదే సూచన చేస్తున్నాన‌ని కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఇటువంటి నిర్ణ‌య‌మే తీసుకున్నారు. కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో ఆమె పాల్గొనరని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు.

కరోనా విజృంభ‌ణ‌ నేపథ్యంలోనే మ‌మ‌త ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న వివ‌రించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్‌ 26న మాత్రమే కోల్‌కతాలో మ‌మ‌త ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అలాగే, అంత‌కుముందు జిల్లాల్లో ఆమె పాల్గొనబోయే అన్ని ఎన్నికల ర్యాలీల సమయాన్ని 30 నిమిషాలకు కుదించారని వివ‌రించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న స‌మూహాలు అధికం కావ‌డంతో క‌రోనా విజృంభ‌ణ పెరిగిపోయింది.
kolkata
West Bengal
Mamata Banerjee

More Telugu News