నువ్వు అని సంబోధించడం నువ్వు చేసిన తప్పు: నెటిజన్ కు నాగబాబు కౌంటర్

19-04-2021 Mon 11:51
  • నటుడిగా నాగబాబుకు మంచి గుర్తింపు
  • టీవీ షోలతో ఎక్కువ బిజీ
  • తలతిక్క ప్రశ్నలకు తన స్టైల్లో జవాబులు  
Nagababu fired on a netizens

నాగబాబు నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను అంగీకరిస్తూ వెళుతున్నారు. ఇక టీవీషోలతో ఎక్కువ బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన కుటుంబ సభ్యులతో సందడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు.

అలాగే మెగా ఫ్యామిలీని గురించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా అందుకు తగిన విధంగా స్పందిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహిస్తూ ఉంటారు. అలా తాజాగా ఆయన ఇద్దరు నెటిజన్లకు ఇచ్చిన ఆన్సర్ల తాలూకు స్క్రీన్ షాట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఒక నెటిజన్ నాగబాబును ఉద్దేశించి 'ఎంత ఆస్తి ఉంది నీకు?' అని అడిగాడు. ఆ మాటకు నాగబాబు తీవ్రమైన అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నన్ను నువ్వు అని సంబోధించావు గనుక నీకు రెస్పెక్ట్ తగ్గిపోయింది. అందువలన నీకు సమాధానం చెప్పను. మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పడమే కాకుండా నీకు సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్" అంటూ తనదైన స్టైల్లో చురక అంటించారు. ఇక మరో నెటిజన్ 'మీ ఇల్లు ఓ 50 కోట్లు ఉంటుందా?' అని అడిగితే, "ముఖేశ్ అంబానీ ఇంటి కంటే ఓ పది రూపాయలు తక్కువ ఉంటుందంతే'' అంటూ తమాషాగా సమాధానమిచ్చారు.