థ్యాంక్యూ కరోనా.. నీ వ‌ల్ల నేను మేక‌ప్ మ‌న్‌గా మారాను: జ‌గ‌ప‌తి బాబు

19-04-2021 Mon 11:42
  • క‌రోనా నేప‌థ్యంలో సొంతంగా మేక‌ప్
  • షూటింగులో ఇబ్బందులు
  • ఫొటో పోస్ట్ చేసిన జ‌గ‌ప‌తి బాబు
jagapati babu share interestion pic

దేశంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ప్ర‌ముఖులు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. త‌మ ప‌నుల‌ను తామే చేసుకుంటున్నారు. సినీ ప్ర‌ముఖులు షూటింగుల్లో పాల్గొనే స‌మ‌యంలో మేక‌ప్ వేయించుకోవ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. అయితే, కరోనా వ‌ల్ల మేక‌ప్ మెన్ అందుబాటులో లేక‌పోవ‌డం, ఒకవేళ వారు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు క‌రోనా భ‌యంతో సొంతంగా మేక‌ప్ వేసుకుంటున్నారు.

తాజాగా, షూటింగ్ లో పాల్గొన్న జగపతి బాబు త‌న మేక‌ప్ తానే వేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. క‌రోనాకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని దాని వల్లే తన‌కు తాను మేకప్ ‌మన్‌ అయ్యాన‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌డంతో ఇత‌ర న‌టులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.