టికెట్లు బుక్ చేసుకుని రాలేకపోయిన తిరుమల భక్తులకు ఊరట

19-04-2021 Mon 09:38
  • ఈ నెల 21 నుంచి 30 మధ్య బుక్ చేసుకున్న భక్తులకు 
  • 90 రోజుల వరకు అనుమతిస్తామన్న టీటీడీ
  • దగ్గు, జలుబు ఉంటే రావొద్దని విజ్ఞప్తి
TTD Good News For Srivari Devotees

ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరటనిచ్చే కబురు చెప్పింది. టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా రాలేకపోయిన భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది.

అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.

మరోవైపు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించాలని టీటీడీ యోచిస్తోంది. మే నెలకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్ల కోటాను రేపు (మంగళవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.అయితే, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టికెట్ల కోటాను రోజుకు 25 వేల నుంచి 15 వేలకు తగ్గించినట్టు సమాచారం.