India: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా.. 12 రోజుల్లోనే కేసుల రెట్టింపు

Indias daily Covid positivity rate doubles in 12 days
  • గత నెలలో 3.05 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు
  • 12 రోజుల్లో 8 శాతం నుంచి 16.69 శాతానికి పెరుగుదల
  • చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 30.38 శాతంగా వారపు పాజిటివిటీ రేపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. కేవలం 12 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 6న 8 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 12 రోజుల్లోనే ఇది డబుల్ అయినట్టు పేర్కొంది. కాగా, పాజిటివిటీ రేటు గత నెలలో 3.05 శాతంగా ఉండడం గమనార్హం. ఇప్పుడది 13.54 శాతానికి చేరుకుంది.

ఇక వారపు పాజిటివిటీ రేటు విషయంలో చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 30.38 శాతం నమోదు కాగా, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్థాన్‌లో 23.33, మధ్యప్రదేశ్‌లో 18.99 శాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇది 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.
India
Corona Virus
Positivity Rate

More Telugu News