Lockdown: ఏప్రిల్‌ 20 నుంచి తమిళనాడులోనూ రాత్రిపూట కర్ఫ్యూ!

  • ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
  • ఏప్రిల్‌ 20 నుంచి ఆంక్షలు అమల్లోకి
  • అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
  • పర్యాటక ప్రదేశాలూ మూత
  • 12వ తరగతి పరీక్షలు వాయిదా
Night curfew even in Tamilnadu

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా తమిళనాడు కూడా చేరింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, పెట్రోల్‌ బంకులు, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌లకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు.

ఇక ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రకటించింది. కూరగాయలు, చేపలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు కూడా ఆదివారం మూసి ఉంచాలని తెలిపింది. ఇక 12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం యథాతధంగా కొనసాగుతాయని తెలిపింది. ఆదివారం రెస్టారెంట్లు, హోటళ్లు ఉదయం 6 గం. నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది. విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

ఊటీ, కొడైకెనాల్‌, యారాకుడ్‌ వంటి పర్యాటక ప్రదేశాలతో పాటు మ్యూజియాలు, పార్కులు, జూలు ఇతర పురాతత్వశాఖ ఆధ్వర్యంలో ఉండే ప్రదర్శనశాలలన్నీ మూసి ఉంటాయి. పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలకు 50 మందిని అనుమతించనున్నారు.

More Telugu News