స్కిన్ స్పెషలిస్ట్ నిర్వాకంతో ఇలా తయారయ్యాను: ఓ యువనటి ఆవేదన

18-04-2021 Sun 21:52
  • చర్మ సౌందర్యం కోసం నిపుణురాలిని సంప్రదించిన రైజా విల్సన్
  • వద్దంటున్నా ట్రీట్ మెంట్
  • కంటి కింద కమిలిపోయిన వైనం
  • ఫోన్ చేస్తే డాక్టర్ నుంచి స్పందన లేదన్న రైజా
Raiza Wilson alleges skin care expert damages her face with false treatment

కోలీవుడ్ యువ నటి రైజా విల్సన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ స్కిన్ కేర్ నిపుణురాలిని కలిసి చికిత్స పొందిన రైజా విల్సన్ ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమె కంటి కింద చర్మం నల్లగా మారి ఉబ్బిపోయింది. ఇటీవల చెన్నైలోని ఓ చర్మ సంబంధ నిపుణురాలిని కలిశానని రైజా వెల్లడించింది. అయితే తన అభ్యంతరాలను పట్టించుకోకుండా ఓ వైద్య విధానాన్ని తనపై అమలు చేసిందని, అప్పట్నించే తన ముఖం ఇలా మారిపోయిందని రైజా ఓ ఫొటో పంచుకుంది.

తాను ఆ డాక్టర్ కు ఫోన్ చేస్తే స్పందించడంలేదని, ఆమె సిబ్బందిని అడిగితే ఊర్లో లేదని సమాధానం చెబుతున్నారని వివరించారు. కోలీవుడ్ లో క్రమంగా గుర్తింపు తెచ్చుకుంటున్న రైజా విల్సన్ తొలి చిత్రం వీఐపీ-2. ధనుష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.