ఐపీఎల్: పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

18-04-2021 Sun 19:22
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • ఢిల్లీ జట్టులో స్టీవ్ స్మిత్ కు చోటు
  • ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్ లాడిన ఢిల్లీ, పంజాబ్
Delhi Capitals won the toss and opted bowling

ఐపీఎల్ లో నేడు జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయం సాధించాయి.

అయితే ఢిల్లీ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఓ మార్పు చేశారు. మురుగన్ అశ్విన్ స్థానంలో జలజ్ సక్సేనా తుదిజట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టులో టామ్ కరన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. అంతేకాదు లూక్మన్ మెరివాలా కూడా తుదిజట్టుకు ఎంపికయ్యాడు.