RCB: డివిలియర్స్, మ్యాక్స్ వెల్ విజృంభణ... బెంగళూరు 20 ఓవర్లలో 204/4

RCB posts huge total against Kolkata Knight Riders
  • ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • 9 పరుగులకే 2 వికెట్లు డౌన్
  • ఆదుకున్న మ్యాక్స్ వెల్
  • చివర్లో చిచ్చరపిడుగులా ఆడిన డివిలియర్స్
ఐపీఎల్ 14వ సీజన్ లో విజయాల బాటలో పయనిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. విధ్వంసక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరవిహారం చేయడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. డివిలియర్స్ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అంతకుముందు, 9 పరుగులకే కెప్టెన్ కోహ్లీ (5), పాటిదార్ (1) వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టును మ్యాక్స్ వెల్ ఆదుకున్నాడు. మ్యాక్స్ వెల్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు సాధించాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 25 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి. పాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.
RCB
KKR
AB deVilliers
Glenn Maxwell
Chennai
IPL

More Telugu News