Rahul Gandhi: కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ

  • భారత్ లో కరోనా విలయం
  • గత 24 గంటల్లో 2.61 లక్షల కేసులు
  • పశ్చిమ బెంగాల్ లో ఇంకా 3 విడతల ఎన్నికలు
  • సభలు, రోడ్ షోలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ
  • ఇతర నేతలు కూడా దీనిపై ఆలోచించాలని పిలుపు
Rahul Gandhi decides to cancel his rallies and meetings in Bengal in the wake of corona pandemic

దేశంలో కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకుంది. సెకండ్ వేవ్ బీభత్సకరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో దేశంలో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 5 విడతల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, మరో 3 విడతలు మిగిలున్నాయి. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాను బెంగాల్ లో సభలు, సమావేశాల్లో పాల్గొనబోనని రాహుల్ గాంధీ ప్రకటించారు.

బెంగాల్ లో తాను పాల్గొనాల్సిన అన్ని సభలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. రాజకీయ నేతలందరూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, భారీ ప్రజానీకంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తే వచ్చే పర్యవసానాలపై లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ప్రధాన పోటీ అంతా అధికార టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొంది. ఇప్పుడు రాహుల్ సభలు రద్దు చేసుకున్నా కాంగ్రెస్ కు కలిగే నష్టం ఏమీ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

More Telugu News