Sun Risers Hyderabad: నట్టూ మోకాలికి గాయం.. అందుకే ముంబైతో ఆడించలేదు: కన్ఫర్మ్​ చేసిన లక్ష్మణ్​

T Natarajan did not play vs Mumbai Indians because of a knee injury confirms VVS Laxman
  • వైద్యులు చికిత్స చేస్తున్నారని వెల్లడి
  • మంచి నిర్ణయమే తీసుకుంటారని కామెంట్
  • ఖలీల్ బౌలింగ్ బాగా చేశాడని ప్రశంస
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ ను ఆడించకపోవడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టతనిచ్చాడు. నట్టూ మోకాలికి గాయమైందని నిర్ధారించాడు. దురదృష్టవశాత్తూ నట్టూ మ్యాచ్ కు దూరమయ్యాడని పేర్కొన్నాడు. నట్టూ ఎడమ మోకాలిలో గాయమైందని, దీంతో అతడి స్థానంలో ఖలీల్ అహ్మద్ ను ఆడించామని చెప్పాడు.

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వైద్యులు అతడికి చికిత్స చేస్తున్నారని, ఇటు నట్టూకు, అటు ఫ్రాంచైజీకి లాభం కలిగించే విధంగా వారు నిర్ణయం ప్రకటిస్తారని తెలిపాడు. ఖలీల్ అహ్మద్ కూడా మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశాడన్నాడు.

మ్యాచ్ పరిస్థితులను అతడు సరిగ్గా అర్థం చేసుకున్నాడని చెప్పాడు. పిచ్ పై బౌన్స్, పేస్ ను సద్వినియోగం చేసుకుంటూ బౌలింగ్ చేశాడని కొనియాడాడు. కాగా, నట్టూను పక్కకు పెట్టలేదని, కేవలం విశ్రాంతినిచ్చామని అంతకుముందు శనివారం టీం డైరెక్టర్ ప్రకటించాడు.
Sun Risers Hyderabad
SRH
VVS Laxman
IPL
Natarajan
Orange Army

More Telugu News