Maharashtra: ఉద్ధవ్​ వి నీచ రాజకీయాలు.. మహారాష్ట్ర సీఎంపై కేంద్ర మంత్రుల మండిపాటు

  • ప్రధాని ప్రయత్నించినా ఉద్ధవ్ తిరస్కరించారన్న హర్షవర్ధన్
  • చాలినంత ఆక్సిజన్ ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడి
  • ఎక్కువ ఆక్సిజన్ పొందింది మహారాష్ట్రేనన్న పీయూష్ గోయల్
  • ఉద్ధవ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం
After PM Busy In Bengal Charge Ministers Respond To Uddhav Thackeray

ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్న తన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, పీయూష్ గోయల్ లు ప్రతి విమర్శలు చేశారు. ఉద్ధవ్ తో మాట్లాడేందుకు ప్రధాని ప్రయత్నించినా.. ఆయనే తిరస్కరించారని పేర్కొన్నారు.

కరోనా ఉద్ధృతంగా ఉన్న మహారాష్ట్రకు చాలినంత ఆక్సిజన్ ను సరఫరా చేస్తామంటూ ఉద్ధవ్ కు ప్రధాని హామీ ఇచ్చారని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. 1,121 వెంటిలేటర్లు కూడా పంపిస్తామని చెప్పారన్నారు. కరోనా కట్టడికి అవసరమైన 5 పిల్లర్లు ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, కరోనా రూల్స్, వ్యాక్సినేషన్’ వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారన్నారు.

అంతకుముందు మరో మంత్రి పీయూష్ గోయల్ .. ఉద్ధవ్ ఠాక్రేపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అందరితోనూ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో సామర్థ్యానికి మించి 110 శాతం ఆక్సిజన్ ఉత్పత్తవుతోందన్నారు.


పరిశ్రమల్లోని ఆక్సిజన్ నూ వైద్య అవసరాలకు పంపిస్తున్నామని వివరించారు. ఇప్పటిదాకా దేశంలో అత్యధికంగా ఆక్సిజన్ పొందిన రాష్ట్రం మహారాష్ట్రేనని పీయూష్ గోయల్ అన్నారు. సాయమందించడంపై అన్ని రాష్ట్రాలకూ కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు.

More Telugu News