Andhra Pradesh: రెండు రోజులు ఎండ మంటలు... ప్రజలు బయటకు రావద్దన్న ఐఎండి!
- విదర్భ నుంచి ఉపరితల ద్రోణి
- 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రత
- కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆపై ఎండ వేడిమి స్వల్పంగా తగ్గుతుందని అంచనా వేశారు. విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని ఓ అధికారి వెల్లడించారు.
ఇదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.
ఇదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.