తెలంగాణలో రేపు కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత

17-04-2021 Sat 21:58
  • దేశంలో కరోనా విలయతాండవం
  • కరోనా వ్యాక్సిన్ కు అధిక డిమాండ్
  • తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత
  • ఆదివారం సాయంత్రం రానున్న వ్యాక్సిన్ డోసులు
  • సోమవారం నుంచి తిరిగి వ్యాక్సినేషన్ షురూ
Telangana govt put corona vaccination hold due to lack of doses

దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి విపరీతమైన వేగంతో విస్తరిస్తుండగా, పలు రాష్ట్రాలు కరోనా టీకాల కొరతతో సతమతమవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. తిరిగి సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని వివరించారు. తెలంగాణలో ఇప్పటివరకు 31.38 లక్షల కరోనా టీకా డోసులు రాగా, 28.97 లక్షల డోసులు వినియోగించారు. 1.22 శాతం డోసులు వృథా అయినట్టు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.