కేంద్రం విజ్ఞప్తితో రెమ్ డెసివిర్ ఔషధం ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు

17-04-2021 Sat 20:14
  • దేశంలో కరోనా విజృంభణ
  • తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య
  • రెమ్ డెసివిర్ ఔషధానికి పెరుగుతున్న డిమాండ్
  • అందుబాటు ధరలు నిర్ణయించాలన్న కేంద్రం
  • సానుకూలంగా స్పందించిన ఫార్మా సంస్థలు
Pharma companies reduced Remdesivir drug price

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధరలు మరీ అధికం కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. రెమ్ డెసివిర్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని ఫార్మా సంస్థలను కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఫార్మా సంస్థలు రెమ్ డెసివిర్ ధరలను తగ్గించాయి.

రెమ్ డాక్ బ్రాండ్ ధర రూ.2,800 నుంచి రూ.899కి తగ్గించగా, రెమ్ విన్ బ్రాండ్ రూ.3,950 నుంచి రూ.2,450కి తగ్గించారు. రెడిక్స్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.2,700కి తగ్గింది. సిప్ రెమీ బ్రాండ్ ధర రూ.4 వేల నుంచి రూ.3 వేలకు... డెస్ రెమ్ బ్రాండ్ ధర రూ.4,800 నుంచి రూ.3,400కి తగ్గింది. ఇక జుబీ-ఆర్ బ్రాండ్ ధర రూ.4,700 నుంచి రూ.3,400కి... కోవిఫర్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గించారు.