టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి కరోనా పాజిటివ్

17-04-2021 Sat 19:41
  • కరోనా బారినపడ్డ టీడీపీ నేత
  • కొవిడ్ సోకిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన బీటెక్ రవి
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
  • బీటెక్ రవి త్వరగా కోలుకోవాలన్న సీఎం రమేశ్
TDP MLC BTech Ravi tested corona positive

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు ఇవాళ కరోనా పాజిటివ్ అని వెల్లడైందని తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

తాను క్షేమంగానే ఉన్నానని, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, మిత్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కాగా, బీటెక్ రవి కరోనా బారినపడ్డారన్న సమాచారంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. 'త్వరగా కోలుకోవాలి రవీ' అంటూ ఆకాంక్షించారు.