TDP: తిరుపతి ఉప ఎన్నికపై సీఈసీకి చంద్రబాబు లేఖ... ఢిల్లీలో ఈసీ వద్దకు టీడీపీ ఎంపీలు!

  • తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ ఆరోపణ
  • ఈసీకి లేఖ రాసిన చంద్రబాబు
  • కేంద్ర బలగాలతో రీపోలింగ్ కు విజ్ఞప్తి 
  • అన్ని చోట్లా దొంగ ఓట్లేశారని టీడీపీ ఎంపీల ఫిర్యాదు 
TDP leaders complains CEC in Tirupati by polls

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా భారీ ఎత్తున దొంగ ఓట్ల దందా నడిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఈసీకి లేఖ రాశారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక సందర్బంగా తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ జరపాలని కోరారు.

అటు టీడీపీ ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలమైందని అన్నారు. అన్ని చోట్లా దొంగ ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ రద్దు కోరామని వెల్లడించారు. కడప నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. నోడల్ అధికారుల నుంచి వివరాలు తీసుకుని ఈసీ విచారణ జరపాలని కోరారు. దీనిపై సీఈసీ స్పందన తర్వాత ఏంచేయాలో నిర్ణయిస్తామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.

More Telugu News