మా తదుపరి ప్రాజెక్ట్ 'ఐకాన్' .. తేల్చేసిన దిల్ రాజు

17-04-2021 Sat 18:32
  • 'వకీల్ సాబ్' తో హిట్
  • 'ఐకాన్' ప్రాజెక్టు ఖాయం
  • పూర్తి స్క్రిప్ట్ సిద్ధం  
  • త్వరలో సెట్స్ పైకి  

Dil Raju Next Project is Icon Movie

అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏమిటి? 'పుష్ప' తరువాత ఆయన 'ఐకాన్' చేస్తాడా లేదా? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది. దిల్ రాజు - వేణు శ్రీరామ్ కలిసి 'వకీల్ సాబ్' సినిమాతో హిట్ కొట్టడం వలన, బన్నీ ఈ ప్రాజెక్టును ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయా? అనే ఉత్కంఠకు తాజాగా దిల్ రాజు తెరదించేశాడు. వేణు శ్రీరామ్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన, తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఐకాన్' అనే విషయాన్ని తేల్చి చెప్పాడు.  'ఐకాన్' నాకు బాగా నచ్చిన కథ .. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక, వెంటనే ఈ సినిమాను మొదలెట్టబోతున్నామని స్పష్టం చేశాడు.

నిజానికి బన్నీ 'అల వైకుంఠపురములో' చేయడానికి ముందే 'ఐకాన్' ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. అలాంటి ప్రాజెక్టుకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారాయి. 'పుష్ప' తరువాత బన్నీ చేయనున్న సినిమా ఇదేననే విషయంలో క్లారిటీ వచ్చేసింది. అంటే 'ఐకాన్ స్టార్' అనే బిరుదు వచ్చేసిన తరువాత బన్నీ చేయనున్న సినిమా కూడా 'ఐకాన్' కావడం విశేషం.