వికారాబాద్ అడవుల్లో బాలయ్య భారీ ఫైట్!

17-04-2021 Sat 17:10
  • భారీగా అంచనాలు పెంచుతున్న'అఖండ'
  • శ్రీకాంత్ విలనిజం ప్రత్యేక ఆకర్షణ
  • హ్యాట్రిక్ హిట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Balakrishna and Srikanth fight in Vikarabad forest

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు వికారాబాద్ అడవులలో జరుగుతోంది. బాలకృష్ణ - శ్రీకాంత్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. బోయపాటి తనదైన స్టైల్లో ఈ ఫైట్ ఎపిసోడ్ ను డిజైన్ చేయించాడట. తెరపై ఈ ఫైట్ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట. 15 రోజుల పాటు షూటింగును జరుపుకోనున్న ఈ యాక్షన్ సీన్ ను, ఈ సినిమాకి హైలైట్ గా నిలపడానికి బోయపాటి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ రైతు పాత్రలోను .. అఘోర పాత్రలోను కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలకి మధ్య గల సంబంధం ఏమిటి? ఏ పాత్ర నుంచి ఏ పాత్రకి బాలకృష్ణ టర్న్ అవుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ విలనిజం ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆయన అభిమానులను అలరిస్తుందో చూడాలి. వాళ్లు మాత్రం ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.