Dr Gurumurthy: బయటి ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చి ఓటు వేస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు: వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి

  • వాడీవేడిగా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
  • దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు
  • విపక్షాలపై మండిపడిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి
  • కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య  
Dr Gurumurthy condemns opposition leaders allegations

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి వెంకటగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

 తిరుపతి నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుంటే... కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు మన్నసముద్రంలో డాక్టర్ గురుమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అటు, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్యం 3 గంటల వరకు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో 52.68 శాతం పోలింగ్, వెంకటగిరి నియోజకవర్గంలో 50 శాతం పోలింగ్, తిరుపతి నియోజకవర్గంలో 38.75 శాతం పోలింగ్, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 49.82 శాతం పోలింగ్ నమోదైంది.

More Telugu News