క్యూబాలో ముగుస్తున్న 6 దశాబ్దాల క్యాస్ట్రో శకం!

  • ఆరు దశాబ్దాల పాటు క్యూబాను పాలించిన క్యాస్ట్రోలు
  • రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన రౌల్ క్యాస్ట్రో
  • పార్టీ విధేయుడికి బాధ్యతలను అప్పగించనున్నట్టు ప్రకటన
Castros era comes to an end in Cuba

దశాబ్దాల పాటు క్యూబాను పాలించిన క్యాస్ట్రోల శకం ముగియబోతోంది. తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు రౌల్ క్యాస్ట్రో తెలిపారు. యువతరానికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. 89 ఏళ్ల రౌల్ క్యాస్ట్రో, ఆయన అన్న ఫిడెల్ క్యాస్ట్రో దాదాపు ఆరు దశాబ్దాలు క్యూబాను పాలించారు.

క్యూబా కమ్యూనిస్టు పార్టీకి విధేయులు, దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి తదుపరి బాధ్యతలను స్వీకరిస్తారని చెప్పారు. ఫిడెల్ క్యాస్ట్రో తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో 2008లో రౌల్ క్యాస్ట్రో క్యూబా నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండటంతో... క్యూబాలో క్యాస్ట్రోల శకం ముగియనుంది.

More Telugu News