క‌రోనాతో టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం మృతి.. ప్ర‌ముఖుల సంతాపం

17-04-2021 Sat 13:29
  • ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస‌
  • కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారివ‌ద్ద ప‌నిచేసిన స‌త్యం
  • ఆయ‌న‌ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా:  పూజ హెగ్డే
  • ఆయ‌న‌ను  మిస్ అవుతున్నాం: థ‌మ‌న్
satyam dies of corona

ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు ఆయ‌న‌ను కాపాడేందుకు చేసిన‌ ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. ఆయ‌న టాలీవుడ్‌లో ప‌లువురు ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేశారు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్  వంటి పెద్ద ద‌ర్శ‌కులు రూపొందించిన ప‌లు హిట్ సినిమాల‌కూ ఆయ‌న ప‌నిచేశారు.  

ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.  కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను అంటూ హీరోయిన్ పూజ హెగ్డే ట్వీట్ చేసింది.  ఆయనతో క‌లిసి అరవింద సమేత, సాక్ష్యం, అల వైకుంఠపురములో సినిమాలు చేశాన‌ని తెలిపింది.

పర్‌ ఫెక్ట్ జెంటిల్‌మన్, గొప్ప వ్యక్తి సత్యం గారి మరణ వార్త బాధాకరమంటూ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ట్వీట్ చేశారు. సెట్స్‌లో  ఆయ‌న ఎంతో నిబద్ధతతో పని చేస్తారని ఆయ‌న చెప్పారు. ఆర్టిస్టులకు ఫ్రెండ్లీగా నేరేషన్ చేస్తుంటారని, ఆయ‌న‌ను  మిస్ అవుతున్నామ‌ని ట్వీట్ చేశారు.