మాజీ సీఎం కుమారస్వామికి కరోనా పాజిటివ్

17-04-2021 Sat 11:37
  • తనకు స్వల్ప లక్షణాలు వున్నాయన్న కుమారస్వామి
  • హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడి
  • తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని విన్నపం
Ex CM Kumaraswamy tests positive with Corona

కర్ణాటకలో కరోనా వైరస్ భారీగా విస్తరిస్తోంది. పలువురు రాజకీయవేత్తలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ముఖ్యమంత్రి యడియూరప్పకు నిన్న కరోనా సోకింది. ఆయన కరోనా బారిన పడటం ఇది రెండో సారి. మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని... స్వల్ప కరోనా లక్షణాలు తనలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కుమారస్వామికి కరోనా సోకడంతో జేడీఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.