తిరుప‌తిలోకి బ‌య‌టి వ్య‌క్తులు చొర‌బ‌డ్డారు: చంద్ర‌బాబు ఫిర్యాదు

17-04-2021 Sat 10:52
  • ఉప ఎన్నిక పోలింగ్ లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయి
  • రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తీసుకొచ్చారు
  • టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నారు
  • స్థానికేత‌రుల‌తో అక్ర‌మాల‌కు ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న బాబు 
chandrababu writes letter to sec

తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. అయితే, ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు లేఖ రాశారు. తిరుప‌తి పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంలోకి బ‌య‌టి వ్య‌క్తులు భారీగా చొర‌బ‌డ్డార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాల‌ను త‌న లేఖ‌కు చంద్ర‌బాబునాయుడు జ‌త చేశారు.

రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తిరుప‌తిలోకి త‌ర‌లించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ నేత‌లు కొన్ని బూత్‌ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తొట్టెంబేడు మండ‌లం కందేలుగుంట‌లో టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నార‌ని వివ‌రించారు. స్థానికేత‌రుల‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ నేత‌లు అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డే ప్ర‌య‌త్నాలు జరుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపణలు చేశారు.