పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: మహేశ్ బాబు

17-04-2021 Sat 10:51
  • కరోనా బారిన పడిన పవన్ కల్యాణ్
  • ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న జనసేనాని
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న సినీ ప్రముఖులు
Get well soon Pawan Kalyan says Mahesh Babu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో ఉంటూనే ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. మరోవైపు పవన్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తాజాగా మహేశ్  బాబు కూడా పవన్ పై స్పందించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'గెట్ వెల్ సూన్.. స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

మరోవైపు, తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిన్న పవన్ తెలిపారు. తిరుపతి ఎన్నికల ప్రచారం, 'వకీల్ సాబ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అయితే ఆ తర్వాత జ్వరం, ఒళ్లునొప్పులు రావడంతో మరోసారి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.